గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుంది. రికార్డులను తిరగరాసిన మగధీర చిత్రం మళ్లీ విడుదలవుతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మెగా బ్లాక్ బస్టర్ మగధీర చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి ఆదరించి చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరారు.