శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన తంత్ర మూవీ ట్రైలర్ వదిలారు. ఫస్టు కాపీ మూవీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ 5లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి. అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. తాంత్రిక శక్తులు నేపథ్యంలో విజువల్స్ ఉన్న ఈ ట్రైలర్ ఉత్కంఠను రేపుతోంది.
అనన్య నాగళ్ల నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘పిల్ల బచ్చాలు ఈ సినిమాకి రావొద్దు’ అంటూ మరింత ఆసక్తిని పెంచారు. ఈ నెల 15న సినిమాను విడుదల చేస్తున్నారు.