ఊ.. అంటావా.. మావ.. ఉ ..ఉ .. అంటావా మావా.. అంటూ ‘పుష్ప’ సినిమాలో ఐటెంసాంగ్ తో కుర్రకారుని కవ్వించిన సమంత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సామ్ విడాకులు తర్వాత అవకాశాలు భారీగా పెరిగాయ్. ప్రస్తుతం సమంత చేతిలో అరజనకు పైగానే చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, తమిళ్ సినిమాలతో పాటు ఓ ఇంటర్నేషనల్ (హాలీవుడ్) మూవీలో కూడా సామ్ నటించడానికి రెడీ అయింది. ఇదే అదునుగా సమంత సినిమాలకి రెమ్యునరేషన్ కూడా పెంచేసింది . సమంత కమర్షియల్స్ యాడ్స్ కి అయితే మరింత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
వీటితో పాటు సోషల్ మీడియాలో కూడా సంపాదిస్తుంది సమంత. ఇటీవల చాలా కమర్షియల్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ గురించి స్టార్స్ తో వారి సోషల్ మీడియాలలో పోస్ట్ చేపిస్తున్నారు. ఇలా పోస్ట్ చేపించినందుకు భారీగానే అమౌంట్ ఇస్తున్నాయి సదరు కంపెనీలు.
ఇక సమంత ఐతే సోషల్ మీడియాలో పెట్టే వాణిజ్య ప్రకటనల పోస్టులకి భారీగానే డిమాండ్ చేస్తుంది. సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టే ఒక్కో కమర్షియల్ పోస్టుకి రు. 15 లక్షల నుంచి రు .20 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం సమంతకి ఇన్స్టాలో 22.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.