అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఆ పాటలో ఆమె ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన ఓ విషయాన్ని సమంత బయటపెట్టారు. ఆ పాట షూటింగ్లో తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో గుర్తు చేసుకున్నారు.
పాట షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై సమంత మాట్లాడుతూ.. ‘‘నా వరకు అది చాలా పెద్ద చాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. అందుకే ఆ సమయంలో వణికిపోయాను. అలాంటి అసౌకర్యమైన, కఠిన పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను’’ అని సమంత వివరించారు. పుష్ప 2లో మరోసారి ఇలాంటి పాట చేస్తారా? అన్న ప్రశ్నకు చేయబోనని స్పష్టం చేశారు.