రాజమౌళి దగ్గర ఇప్పటికే లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా వోల్వో ఎక్స్ సీ 40 ఎస్ యూవీని కొనుగోలు చేశాడు. దీని ఖరీదు రూ.44.50 లక్షలు. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యి నెలరోజులు దాటినా.. ఇంకా కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ సందర్భంగా రాజమౌళి తన గ్యారేజ్‌లో కొత్త కారును యాడ్ చేశాడు. . ఇక దీని ఫీచర్స్ విషయానికొస్తే.. 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో కారుకు పవర్ నిచ్చారు. ఈ ఇంజన్ తో 187 బీహెచ్ పీ వద్ద 300 నానోమీటర్ల టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అంతే కాకుండా దీనికి 8 గేర్లు ఉండడం విశేషం. రాజమౌళి కొత్త కారు కొన్న విషయాన్ని వోల్వో కంపెనీ తెలిపింది.