శ్రీదేవి హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా ‘బంగారక్క’.. ఆ సినిమాలో హీరో మురళీమోహన్. ఆయన సంగీతం మాస్టారుగా.. శ్రీదేవి స్టూడెంట్ గా నటించారు. ఆ షూటింగ్ లో నన్ను శ్రీదేవి వాళ్ల అమ్మగారు చూశారు. కుర్రాడు బుద్ధిమంతుడిలా ఉన్నాడు .. చేతిలో సినిమాలు కూడా బాగానే ఉన్నాయి .. మా శ్రీదేవిని ఇచ్చి చేస్తే బాగుంటుందేమో’ అని నాకు తెలిసిన ఆవిడతతో అన్నారట అని మురళీమోహన్ ఇటీవల ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆయనకు పెళ్లయిపోయింది .. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆవిడ చెప్పినా శ్రీదేవి వాళ్ల అమ్మగారు నమ్మలేదట. అప్పుడు మా ఇంటికి తీసుకుని వచ్చి మా ఆవిడను .. మా ఇద్దరి పిల్లలను చూసిన తరువాత ఆమె నమ్మారు అని మురళీమోహన్ చెప్పారు.