ఇటీవల విడుదలయిన మూవీలలో RRR తర్వాత అంత స్థాయిలో ఆసక్తి రేపిన సినిమాలు కేజీఎఫ్ 2, మరొకటి బీస్ట్,యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 ఘన విజయం సాధించింది. RRR రికార్డుల స్థాయికి ధీటుగా నిలబడింది. ఆ మూవీ వసూళ్లతో పోటీపడిన విషయం తెలిసిందే.. ఎంతో ఆసక్తి రేపి ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో మూవీ బీస్ట్. స్టార్ తమిళ హీరో ఈ విజయ్ నటించిన ఈ సినిమాపై అందరి అంచనాలు తారస్థాయి కెళ్లాయి. కాని బీస్ట్ ఆ ఆసక్తికి తగ్గట్టు ప్రేక్షకులను అలరించలేక పోయిందనే చెప్పాలి.
‘కేజీఎఫ్ 2’ .. మరో వైపున ‘బీస్ట్’ ఒకరోజు తేడాతో థియేటర్ల కొచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కేజీఎఫ్ 2 ఎఫెక్ట్ బీస్ట్ పై పడుతుందని భావించినా.. విజయ్ మాత్రం వెనుకాడలేదంటున్నారు. అయితే చెన్నై సిటీలో వసూళ్ల విషయంలో ‘బీస్ట్’ను ‘కేజీఎఫ్ 2’ అధిగమించిందనేది కోలీవుడ్ సమాచారం. సోమవారం చెన్నై సిటీలో ‘బీస్ట్’ 36 లక్షలను వసూలు చేస్తే, ‘కేజీఎఫ్ 2’ 62 లక్షలను రాబట్టింది. యశ్ తో పాటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ కి విపరీతమైన ఇమేజ్ ఉండడం .. కథాకథనాల పరంగా ‘బీస్ట్’ వీక్ గా ఉండడాన్ని మరో కారణంగా చెబుతున్నారు.