మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటోంది. వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సుమారు రూ.60. కోట్లు. గత వారం విడుదలైన ఆ సినిమాకు ప్రేక్షకులు అధికసంఖ్యలో థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇంతకీ ఆసినిమా ఏమిటంటే.. యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ‘కార్తికేయ2’. ఈ హిందీ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలచేశారు ఈ మూవీని. అన్ని భాషల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీలో అయితే వేగంగా దూసుకుపోతోంది. హిందీలో కేవలం 50 స్ర్కీన్లలో విడుదలైన ఈ మూవీ వారం తిరిగే సరికి 3000 స్ర్కీన్లకు పెరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే ప్రతీ రోజు షోల సంఖ్య కూడా పెరుగుతోంది.
సినిమా నేపథ్యం శ్రీ కృష్ణుడికి సంబంధించిన కావడంతో సినిమా చాలా మందికి బాగా కనెక్ట్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమిర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ సినిమా ‘రక్షా బంధన్’ విఫలం అవడం కూడా ‘కార్తికేయ2’కు ప్లస్ అయిందని అంటున్నారు. ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షా బంధన్’ సినిమాలను తీసేస్తున్న థియేటర్లు ‘కార్తికేయ2’ షోస్ ను పెంచుతున్నారు. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారంలోనే వసూళ్ల సునామీ సృష్టించడం నిఖిల్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.