జయసుధ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆమె ఒక ఇంటర్వ్యూలో “నా అసలు పేరు సుజాత .. తమిళ దర్శక రచయిత గుహనాథన్ గారు నా పేరును జయసుధగా మార్చారు. ‘జ్యోతి’ సినిమాతో నా కెరియర్ దూసుకెళ్లింది. జయప్రద – శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య నేను నా ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగాను. అని చెప్పుకొచ్చారు.
అలాగే ఆస్తుల కోసం వివరించారు. సొంత సినిమాల వల్ల నష్టపోయానని బాధను వ్యక్తం చేశారు. ” చెన్నైలో ఒక ప్రాంతంలో స్థలం తీసుకుని పెద్ద బిల్డింగ్ కట్టాను. కానీ ఆ తరువాత వచ్చిన స్లంప్ కారణంగా ఆ బిల్డింగ్ రెంట్ కూడా పోలేదు . దాంతో అమ్మేయవలసి వచ్చింది. ఇప్పుడు అది ఇంకా బిజీ సెంటర్ అయింది. అలాగే ఇంకొక చోట 9ఎకరాలు కొన్నాను. కానీ అక్కడి నేలలో బోర్ పడలేదని అమ్మేశాను. ఇప్పుడు దాని విలువ 100కోట్లకు పైనే ఉంటుంది. ఆ స్థలానికి ఆనుకునే రజనీకాంత్ గారి ఫామ్ హౌస్ ఉంది” అని చెప్పారు.