”వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు… జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ..పలానా వ్యక్తి దుర్మరణం..” ఇలాంటి వార్తలు ఇటీవల తరచూ వింటున్నాం. గుండె పోటు.. అది కూడా యువతకే ఎక్కువ.. ఈ రెండు, మూడేళ్ళలో నిత్యం ఇలాంటి ఘటనలే తారసపడుతున్నాయ్. .. ముఖ్యం గా కరోనా తర్వాత యువ గుం డెకూ గాయాల పోటు తగులుతున్నది.35- 40 ఏళ్ల వారు గుండెపోటు బారిన పడటం పెరుగుతున్నదని ఓహియో స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి సర్కుల్యేషన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కొవిడ్-19 బారినపడి చికిత్స తీసుకొన్నవారిలో 61 శాతం మందికి గుండె పోటు సహా ఇతర గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టు తెలిసింది. కొవిడ్ టీకా తీసుకున్న కొందరిలో గుండె పోటు, హృద్రోగాల సమస్యలు వచ్చాయని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. హృదయ స్పందన(హార్ట్ బీట్)లో సమస్యలు కూడా గుండె పోటుకు కారణమవుతాయని ‘సెంటర్ ఫర్ ఇం టిగ్రేటివ్ మెడికల్ సైన్సెస్’ పరిశోధనలో తేలింది. నిర్దిష్టమైన జన్యు పరమైన వైవిధ్యాలకు, హృదయ స్పందన సమస్యలకు సంబంధం ఉందని ఈ పరిశోధన తెలిపింది. దీర్ఘకాలం గాలి కాలుష్యం బారిన పడినవారిలోనూ గుండె పోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయని జామ నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది.
చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు
కొవిడ్-19, మారిన జీవన శైలి, మానసిక ఒత్తిడి వల్ల యువతలో గుండె పోటు ఘ టనలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. గుండె దడ, ఆందోళన, వ్యా యామం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వల్ల కూడా గుండెపోటుకు గురవుతున్నారు. హృదయ స్పందనలో సమస్యలు ఏర్పడినప్పుడు గుండెలో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందని, ఇదే రక్తం మెదడుకు వెళ్లినప్పుడు అక్కడ కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ధమనులు చిట్లడం, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా గుండెపోటుకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. కొవిడ్ నుంచి బయటపడిన వారిలోనూ ఈ సమ స్య ఉండటం వల్ల గుండె పోటు సంభవిస్తున్నదని వివరించారు. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతున్నదని, ఇది గుండె జబ్బులకు దారి తీస్తున్నదని వైద్యులు సెలవిస్తున్నారు.
గుజరాత్లో కొన్ని గంటల్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు.. పెండ్లి పందిరిలోనే స్పృహ తప్పి పడిపోయింది. చిన్న వయస్సులోనే ఆమె మరణానికి కారణం… గుండె పోటు. ఒకప్పుడు 60, 70 ఏళ్ళు దాటినవారికి వచ్చే గుండెపోటు ఇప్పుడు 25 – 30 ఏళ్ల వయస్కులనూ పీడిస్తున్నది.
గుండె పోటుకు కారణాలు
- గాలి, నీటి కాలుష్యం
- చదువుల్లో, ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురవడం
- అనారోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం చేయకపోవడం, కఠిన వ్యాయామాలు చేయడం
- ధూమపానం, మద్యపానం, అధిక కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం..
- కూరగాయలు, పండ్లు తగినంత తినకపోవడం..
- జన్యు పరమైన, వంశ పారంపర్య కారణాలు
- గుండె పోటు లక్షణాలు
- ఛాతి మంట, ఛాతి బరువుగా ఉండటం, మధ్యలో నొక్కినట్టు అనిపించడం
- చెమటలు పట్టడం, వాంతులు, విపరీతమైన అలసట రావడం
ముందు జాగ్రత్త చర్యలు
- కఠిన వ్యాయామం చేసే ముందు గుండె పరీక్షలు చేయించుకోవాలి.
- కొవ్వు అధికంగా ఉన్నవారు, గుండె కొట్టుకొనే వేగంలో తేడాలున్నవారు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
- 20 ఏళ్ల పైబడినవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
- నిత్యం యోగా, ధ్యానం చేయాలి
- రోజుకు కనీసం అర గంట పాటు నడవాలి లేదా వ్యాయామం చేయాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, నూనె ఎక్కువగా వాడిన ఆహారం మానేయాలి.