” ప్రతిరోజూ 30 నిమిషాలు సైకిల్ తొక్కితే అది గుండె జబ్బులను 50 శాతం వరకు నివారిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. సైకిలు తొక్కటం గుండెకు మంచి వ్యాయామం. శరీరంలోని రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. గుండె రక్తనాళాలలో బ్లాకేజీ లేకుండా చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది – కొద్ది కిలోమీటర్ల సైక్లింగ్పె మీ శరీరంలో జీవప్రక్రియ అధికం చేస్తుంది. ఒత్తిడి, మానసిక వేదనలను తగ్గిస్తుంది.”
సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బలపడతాయి.కీళ్ల నొప్పుల సమస్య దూరం అవుతుంది.గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే వారు రోజూ సైక్లింగ్ చేస్తే నడుము నొప్పి, మెడ నొప్పి, నరాలు లాగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక రక్త పోటును నివారించడంలో సైక్లింగ్నూ అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు కాసేపు సైకిల్ తొక్కితుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది. అలాగే నిద్ర లేమికి సైక్లింగ్చె ఉపయోగపడుతుంది.
పర్యావరణాన్ని రక్షించండి…అంటూ ప్రజలలో ఉవ్వెత్తున వచ్చిన ఉద్యమం తర్వాత, కొంతమంది సామాజిక స్పృహ ఉన్నవారు సైకిల్ తొక్కటానికి ఇష్టపడుతున్నారు. అధిక మైలేజీలనిచ్చే బైక్ లు లేదా సుఖాలనిచ్చే కార్లు కూడా పక్కన పెట్టేస్తున్నారు. టీనేజర్ల దగ్గరనుండి మధ్య వయసు వారివరకు నేడు సైకిలింగ్ అనేది శారీరక వ్యాయామంతో పాటు., నేటి తరవానికి ఒక ఫ్యాషన్ గా మారింది.
-సైకిలింగ్ చేయటం వలన వచ్చే ప్రయోజనాలు కండరాలు బలపరుస్తుంది – సైకిలు తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరచి మంచి శక్తి కలిగిస్తుంది. ప్రత్యేకించి నడుము, తొడలు, పిరుదులు, పిక్కలు, పాదాలు లోని కండరాలు బలపడతాయి.
– బద్ధకంగా ఉందా? మీ సైకిల్ తీసుకొని ఒక రౌండ్ వేయండి. బద్ధకం వదిలిపోతుంది. దీనికి కారణం మీ శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది.కండరాలు పటుత్వం సంతరించుకుంటాయి. ఈ వాహనంలో ప్రధానంగా గల ప్రయోజనాలు ఇవి.
-శరీర బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది – సైకిల్ తొక్కటం వలన బరువు త్వరగా తగ్గవచ్చు. అది మీలోని కేలరీలు ఖర్చు చేసి, కొవ్వులను కరిగిస్తుంది. వేగంగా కనుక సైకిల్ తొక్కితే, అసలు మీరు బరువు పెరిగే ప్రసక్తి లేదు. కనుక సైకిల్ తొక్కే వారైతే, ఆహారం బాగా తగ్గించాల్సిన పని అసలే లేదు.
-కీళ్ళ నొప్పులకు వ్యాయామం – కండరాలు బలపడటమే కాక, సైకిల్ తొక్కితే మీ కీళ్ళ నొప్పులు కరూడా మాయమవుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గించాలంటే ఇది మంచి పరిష్కారం. మందులు వేయాల్సిన పనిలేదు. రెగ్యులర్ గా సైకిల్ తొక్కి దాని ప్రభావం చూడండి.
-గుండె ఆరోగ్యానికి మంచిది – సైకిల్ ఎక్కి కొంత ప్రయాణించండి. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్ తొక్కారంటే, మీలోని ఒత్తిడి, మరియు డిప్రెషన్ వంటివి దూరం అవుతాయి. . శ్వాస మెరుగుపరుస్తుంది – సైకిలింగ్ చేసేటపుడు మీరు అధికంగా గాలి తీసుకోవడం, వదలడం వంటివి చేస్తారు.గట్టిగా శ్వాస తీయడం, వదలడం మీలోని మలినాలను విసర్జిస్తుంది. వేగంగా సైకిల్ తొక్కితే అది మీ శ్వాసను పెంచి గుండెను కాపాడుతుంది.
-సైకిల్ తొక్కటం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఎన్నో. కనుక, మీ స్పోర్ట్ షూస్ వేసేయండి, సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి, తేలికగా సైకిల్ పై ప్రయాణించండి.అయితే, సైకిల్ తోపాటు ఒక బాటిల్ నీరు, టవల్ కూడా వెంట పెట్టుకు వెళ్ళండి. ఎందుకంటే, సైకిలింగ్ లో చెమట అధికంగా పడుతుంది. పొట్టలో నీరు అధికంగా నింపవలసి వస్తుంది. కొత్తగా సైకిల్ తొక్కే వారికి కాలి పిక్కలు కొద్ది రోజులు నొప్పులు పెడతాయి. అటువంటపుడు తొక్కే దూరం తగ్గించండి. క్రమేణా దూరం, వేగం పెంచుతూ దృఢమైన శరీరాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం.