పొరుగు రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అమూల్ డెయిరీ వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది. కర్ణాటకలో అతి పెద్ద సహకర డెయిరీ నందిని. కర్ణాటకలో లక్షల రైతు కుటుంబాలు పాడి ద్వారా ఆర్థిక స్వావలంబనను ఈ నందిని డెయిరీ ద్వారా సాధించారు. ఇప్పుడు ఈ నందిని డెయిరీని అమూల్‌లో విలీనం చేయాలని కేంద్రం ప్రయతిస్తోంది ఇటీవల కర్ణాటకలో ఓ సభలో కేంద్రమంత్రి అమిత్ షా అమూల్నో పై చేసిన కామెంట్స్టి అక్కడి రైతుల్ని ఆగ్రహానికి గురిచేశాయి. గుజరాతీలు కన్నడిగుల్ని దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వరుసగా మండి పడుతున్నారు. కర్ణాటకకు చెందిన విజయా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారని.. కర్ణాటకలో ఉన్న పోర్టులన్నీ అదానీకి కట్టబెట్టారని ఇప్పుడు రైతుల్ని కూడా గుజరాత్ కు చెందిన అమూల్ కు కట్టబెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సెంటిమెంట్ గా మారడంతో అక్కడ అమూల్ ఉత్పత్తుల్ని కొనకూడదని కట్టుబాటు తీసుకుంటున్నారు. ప్రైవేటు హోటల్స్ అసోసియేషన్ నందిని మిల్క్ మాత్రమే కొంటామని ప్రకటించాయి. ఈ వివాదం రాజకీయ దుమారం రేగుతోంది. అమూల్ గుజరాత్ లో సహకార సంస్థగా ప్రారంభమైనా.. అది ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తూ కార్పొరేట్ సంస్థలా మారుతోంది. దీంతో కన్నడిగులు ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇదో పెద్ద సెంటిమెంట్ అస్త్రం అయిపోయింది. నిజానికి అమూల్ ను విస్తరించడానికి తెర వెనుక ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఏపీలో అయితే ఏ సమస్యా లేకుండా ప్రభుత్వమే ప్రజాధనాన్ని ఇచ్చి మరీ వ్యాపారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తోంది . ఇందు కోసం సహకార డెయిరీల్ని నిర్వీర్యం చేస్తోంది. సంగం డెయిరీని కూడా దాదాపుగా స్వాధీనం చేసుకుంది. కోర్టులు అడ్డు పడ్డాయి బట్టి ఆగిపోయింది. ఇదంతా అమూల్ కోసమే చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏపీలో జనం మాత్రం పట్టించుకోలేదు. కానీ కర్ణాటకలో మాత్రం అలా కాదు . తిరగబడుతున్నారు. ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.