‘ఎవరూ చూడటంలేదన్న ధైర్యంతో ఓ ఇద్దరు యువకులు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటతో ఆగ్రహంతో బాలిక కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన యువకులకు దేహ శుద్ధి చేసి నిప్పు పెట్టారు..’ మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు దుండగులకు బాధితురాలి కుటుంబసభ్యులు నిప్పుపెట్టారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. బాలికపై లైంగికదాడి విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఇద్దరు దుండగులను పట్టుకొని తమ గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం చితకబాది నిప్పుపెట్టారు. దీంతో తీవ్రగాయాలపాలైన ఇద్దరిని స్థానికులు హాస్పటల్ద కి తరలిస్తుండగా ఒకడు మృతిచెందాడు. మరొకడు చికిత్స పొందుతున్నాడు.