‘ రకరకాల ఆహారాలను అమితంగా ఇష్టపడే ఎలాన్ మస్క్ సడన్ గా బరువు తగ్గారు.. ఎందుకనుకుంటున్నారా?’
రుచికరమైన ఆహారాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. తాజాగా తిండిపై శ్రద్ధ పెట్టారట. అంతేకాదు, వ్యాయామం కూడా చేయడానికి ఇష్టపడని ఆయన.. తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్లే ఇటీవల తొమ్మిది కిలోల బరువు తగ్గారట. ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించిన ప్రపంచ కుబేరుడు.. తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.
ఆహారం విషయంలో ఎలాన్ మస్క్ సరైన నియమాలు పాటించరని ఆయన తండ్రి ఎరాల్ మస్క్ ఇటీవలే వెల్లడించారు. అంతేకాదు, బరువు తగ్గేందుకు ఔషధాలు వాడవచ్చు కదా! అని సూచించారు. దీంతో నాన్న చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకున్న మస్క్.. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు ఔషధాలు కాకుండా ఉపవాసం పాటించే పద్ధతిని ఎంచుకున్నట్టు మస్క్ తాజాగా వెల్లడించారు.