హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లోకి హోండా యాక్టీవా ప్రీమియం న్యూ ఎడిషన్ తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ హోండా, హోండా యాక్టీవా 125, హోండా యాక్టీవా ప్రీమియం వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం ఎడిషన్ హోండా యాక్టీవా ధర రూ.75,400. యాక్టీవా డీఎల్ఎక్స్ వేరియంట్ ధర మరో రూ.1000 అదనం.
యాక్టీవా ప్రీమియం ఎడిషన్‌లో 3డీ గోల్డ్ కోట్ ఎంబ్లం, బ్రౌన్ కలర్డ్ ఇన్నర్ బాడీతోపాటు గోల్డెన్ వీల్స్, సీట్ కవర్స్ వస్తాయి. గోల్డ్ కోటెడ్ క్రోమ్ ఫ్రంట్ గార్నిష్తోపాటు గోల్డెన్ మార్క్ హోండా ఆప్రాన్ ఉంటుంది. ఈ మోడల్ యాక్టీవా మాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మాట్ సంగ్రియా రెడ్ మెటాలిక్, పెరల్ సెరెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ప్రస్తుత హోండా యాక్టీవా మోడల్లోనూ ప్రీమియం హోండా యాక్టీవా కూడా 109.5సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5500 ఆర్పీఎం వద్ద 5.73 కిలోవాట్ల విద్యుత్, గరిష్ఠంగా 5500 ఆర్పీఎం వద్ద 8.84 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 106 కిలోల బరువు గల స్కూటర్లో 5.3 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ప్రీమియం ఎడిషన్ 130 ఎంఎం ఫ్రంట్, 130 ఎంఎం రేర్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది.
యాక్టీవా ప్రీమియం ఎడిషన్ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. 3.0.ఏహెచ్ బ్యాటరీ, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. 1833 మి.మీ పొడవు, 697 మి.మీ వెడల్పుతోపాటు 1156 ఎంఎం ఎత్తు వస్తుంది. 1260 మి.మీ వీల్ బేస్‌తో వస్తుంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ .. మార్కెట్లోకి న్యూ సీబీ300 ఎఫ్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది 2 డీలక్స్, డీలక్స్ ప్రో వేరియంట్లలో లభ్యం అవుతుంది.