‘ ఏవైనా ఆరోపణలు వస్తే మన దేశంలో అయితే ఏం చేస్తారు రాజకీయ నాయకులు. ఎదురుదాడి చేస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళైతే మరీనూ.ఏపీలో హిందూపురం వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వివాదంలో సిగ్గు వదిలేసి ఆయన్ని వెనకేసుకురావడంతోపాటు.. ప్రతిపక్షలు, మీడియాపై నిసిగ్గుగా వ్యవహరించారు. అదే ఫిన్లాండ్ లో ప్రధానిపై ప్రతి పక్షం వారు డ్రగ్స్ వాడారని ఆరోపిస్తే.. ఏకంగా ప్రధాన మంత్రి డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు..’
మిత్రులతో కలిసి పార్టీ చేసుకొన్నందుకు గానూ ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించి ఉండొచ్చని, ప్రధాని వాటిని తీసుకొని ఉండొచ్చని విపక్షాలు నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో మారిన్ డ్రగ్స్ ఐడెంటిఫికేషన్ పరీక్ష చేయించుకున్నారు.
ఈ విమర్శలను ఇదివరకే మారిన్ తోసిపుచ్చి, విచారం వ్యక్తం చేశారు. ‘ఓ సాయంత్రం వేళ.. మిత్రులందరం కలిసి పార్టీ చేసుకున్నాం. ఆ సందర్భంగా డ్యాన్సులు, పాటలు పాడటం వాస్తవమే. ప్రైవేటుగా చేసుకున్న ఆ పార్టీ వీడియో లీక్ కావడం దురదృష్టకరం. కేవలం ఆల్కహాల్ తప్ప ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. మేం చేసినవన్నీ చట్టానికి లోబడినవే. మేము ఏ తప్పూ చేయలేదు’ అంటూ ఆమె వివరణ ఇచుకున్నారు. ఆమెను ఎంతైనా మెచ్చుకోవాల్సిందే.