మెగాస్టార్. సినిమాల ద్వారా వచ్చే సొమ్ముతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలతో వేల కోట్లు ఆర్జి0చిన గ్రేట్ ఆర్టిస్ట్. హైదరాబాద్ లో ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో భారీ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించారు చిరంజీవి. వచ్చే ఏడాదికల్లా ఈ ఆసుపత్రి రెడీ అవుతుందని ఓ ప్రకటన కూడా చేసారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆయన తండ్రి పేరు పెట్టుకుంటున్నారు.. మరి దాతలు సహకరిస్తే మరిన్ని సేవలు అందిస్తామని చేసిన ప్రకటనలో అంతరార్థం ఏంటో మరి. చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్.. ఇద్దరు టాలీవుడ్ లోనే కాదు.. దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటులు. ఎవరైనా తమ కుటుంబ సభ్యులు పేరుతో అసుపుత్రో, మరొకటో పెడితే వాళ్లే మొత్తం పెట్టుకుంటారు. ఇది పద్దతి కూడా. అందునా చిరంజీవి లాంటి సినీ బిలియనీర్ చేపట్టబోయే సేవా కార్యక్రమమైన ఆసుపత్రి కి దాతల సహకారం అడగటం ఏంటో అర్ధం కావడంలేదు.. అంటూ ఆయన అభిమానులు ప్రతిష్టాత్మకంగా ఫీలవుతున్నారు. ఎన్ని వందల కోట్లయినా మా మెగాస్టారే పెట్టుకోవాలి.. ఈ స్థాయిలో ఉండి దాతల సహకారం కోరటమేంటి? ఇది ఆయన అభిమానులమైన మాకు అవమానం కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.