హిండెన్‌బర్గ్ రీసర్చ్(Hindenburg Research) సంస్థ త్వరలో కొత్త రిపోర్ట్‌ను రిలీజ్ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ సంస్థ తన ట్విట్టర్లో తెలిపింది. ఇటీవల అదానీ స్టాక్స్(Adani stocks) అంశంపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ వల్లే.. ఆ కంపెనీ షేర్లు పతనమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హిండెన్‌బర్గ్ ఎవర్ని టార్గెట్ చేసిందన్న కోణంలో పుకార్లు సాగుతున్నాయి. ఓ అతిపెద్ద విషయాన్ని బహిర్గతం చేయనున్నట్లు హిండెన్‌బర్గ్ తన ట్వీట్లో వెల్లడించింది.