by Srinivas Vedulla | Apr 18, 2025 | ఆంధ్రప్రదేశ్
వైసీపీ అధికారంలో ఉన్న్డపుడు దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో ఆ పార్టీ MLC అనంతబాబు అలియాస్ అనంత ఉదయ భాస్కర్ పై ఉచ్చు బిగుస్తోంది . – కేసు విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది .
వీధి సుబ్రహ్మణ్య0. ఒకప్పుడు అనంత్ బాబు కారు డ్రైవర్. ఉద్యోగం మానేసిన తర్వాత అతన్ని హతమార్చి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్లు YSRCP MLC అనంతబాబుపై ప్రధాన అభియోగం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయ అనుచరుడిగా పేరొందిన అనంతబాబు తూర్పు మన్యంలో రెండున్నర దశాబ్దాలుగా అరాచకాలకు పాల్పడుతున్నా అతనికి అన్ని పార్టీలలోనూ ఉన్న బంధు గతం కాపలా కాస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి .
కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.
కాకినాడకు చెందిన దళిత యువకుడు, డైవర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి, డోర్ డెలివరీ చేశారన్న నేరారోపణలపై నమోదైన కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
తన మాజీ డ్రైవర్‌ను తానే హత్య చేశానంటూ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ వెల్లడించారు. తరువాత ఆయన్ను జైలుకు తరలించారు. నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసు అధికారులు చక్రం తిప్పారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి . . ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పొందిన అనంతబాబు రెండేళ్లుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ నిరుపేదలైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకాలమ్మ, సత్యనారాయణ మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
లోతైన విచారణకు డిమాండ్ . .. సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా 88 రోజులకు 2022 ఆగస్టు 22న పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును న్యాయస్థానం తిరస్కరించింది. 2023 ఏప్రిల్ 14న అనుబంధ ఛార్జిషీట్ వేశారు. కావాలనే గడువులోగా ఛార్జిషీట్ వేయకుండా నిందితుడికి బెయిల్ వచ్చేలా అప్పటి ఎస్పీ, డీఎస్పీలు సహకరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించాలన్న వాదన దళిత వర్గాల నుంచి వినిపిస్తోంది ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చేలా హత్య జరిగినప్పుడు అంతకుముందు, తరువాత నిందితుడు తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారో పోలీసులు తేల్చడానికి ప్రయత్నించలేదు . ఘటనా స్థలంలో ఎవరున్నారో టవర్ లోకేషన్, గూగుల్ టేక్అవుట్, సీసీ ఫుటేజీలతో గుర్తించలేదు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్‌మెన్లనూ సమగ్రంగా విచారించలేదు. దీనిపై సమగ్ర విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయ్ .
.
సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ముద్దాయికి కొందరు పోలీసు అధికారులు, గత ప్రభుత్వం సహకరించిందని ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. యువకుడి శరీరంపై 31, అంతర్గతంగా మరో మూడు గాయాలు చేయడం ఒక్కరివల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో మరింతమంది ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు విచారణ చేయలేదన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రాసిక్యూషన్‌కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తానని ముప్పాళ్ల సుబ్బారావు ‘అభిన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు .
by Srinivas Vedulla | Apr 17, 2025 | ఆంధ్రప్రదేశ్
గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులలో గందరగోళం..
మరో 44 వేల ఎకరాలు తీసుకుంటే,, ఈ భూములు ఎవరు కొంటారు ? రెండవ దఫా భూ సమీకరణ చేపడతారన్న భయంతో ముందు తీసుకున్న భూముల లావాదేవీలపై స్తబ్దత
అమరావతి రైతులతో కూటమి సర్కార్ ఆటలాడుకుంటోంది. గతంలో సమీకరించిన 33 వేల ఎకరాల రైతులకు పూర్తిగా ప్లాట్స్ కేటాయింపు ప్రక్రియ జరగకుండానే . . రెండో దఫా పూలింగ్ కోసం సర్కార్ సన్నాహాలు చేస్తోంది.
గందరగోళంలో రియల్ ఎస్టేట్ : అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టడానికి కూటమి సర్కార్ సన్నాహాలు చేస్తున్న వార్తలు రావడంతో ఈ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఉన్న వేల ఎకరాలలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా మరో 44 వేల ఎకరాల సమీకరణ చేస్తే . .. ఈ ప్రాంతంలో భూముల ధరల గణనీయంగా తగ్గుతాయన్న అంచనాలు వస్తున్నాయ్ . ఈ ప్రభవవంతో 2nd పేజ్ – లాండ్ పూలింగ్ లీకులు వచనప్పటి నుంచి 29 గ్రామాల పరిధిలో భూముల క్రయవిక్రయాలపై నీలినీడలు అలుముకున్నాయి .
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరిస్తే.. విజయవాడ సమీపంలో గన్నవరంలో విమానాశ్రయం ఉంది . దీనికి 1200 ఎకరాల భూమి గతంలో సేకరించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించాలంటే . . దీనికే మరో 2 వేల ఎకరాల భూసమీకరన్ చేస్తే సరిపోతుంది. రాజధాని భూ సమీకరణ ప్యాకేజ్ టైప్ లో చేస్తే రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారు . చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ కి సమీపంలో ఐటీ , AI వంటి కార్యాలయాలు ఉంటె బాగుంటుంది . ఇదే విమానాశ్రయం సమీపంలో, లేదా విమానాశ్రయానికి చేర్చి . . మరో 4,5 వేల ఎకరాల భూమి తీసుకునే విధానాన్ని చంద్రబాబు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆందోళనలో అమరావతి రైతులు : ”చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలయింది . ఆరేడు నెలలుగా రైతుల ప్లాట్లలలో మొలిచిన తుప్పలనే ఇంకా తొలగించలేకపోయారు . అలాంటిది మిగిలిన నాలుగేళ్లలో ఏమి చేయగలరు ? ఎంతవరకు చేయగలరు ? కొత్త నగరం నిర్మించాలంటే కావాల్సిన ప్రాధమిక రహదారులు శరవేగంగా నిర్మిస్తే అభివృద్ధి దానంతట అదే నడుస్తుంది . ఈ ప్రాధమిక సూత్రాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోవడంలేదు . విశ్వ నగరం నిర్మిస్తా . .. అంటూ ప్రగల్బాలు పలుకడం మానుకోవాలి . ” అంటూ తుళ్లూరుకు చెందిన చాగంటి మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు .
”ల్యా0డ్ పూలింగ్-2 అంశం తెరపైకి తేవడం వల్ల . .. ఇపుడిపుడే నడుస్తున్న అమరావతి రియల్ ఎస్టేట్ పై పిడుగుపడినట్లయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేస్తే చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత పెరుగుతుంది. విశ్వాసం కోల్పోయి తర్వాత అమరావతిని , రాష్ట్రాన్నీ ముంచేస్తారన్న భయం కలుగుతుంది . .. ‘ అని వెలగపూడి కి చెందిన ”శివన్నారాయణ అనే ఆటో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేసారు .
చంద్రబాబు నుంచి అమరావతిని కాపాడాలి : ‘ గతంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి అమరావతికి విముక్తి కలిగించాలని ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాం. ఎన్నో ఆందోళనలు చేసాం . చంద్రబాబు వచ్చారని ఎంతో సంబరపడ్డాం . కానీ ఇతని పిచ్చి ఆలోచనలు చూస్తుంటే వీళ్ళే అమరావతిని ముంచేస్తారనిపిస్తోంది . .” అని వడ్లమానుకు చెందిన రాజధాని ఉద్యమ మహిళా నాయకురాలు చెప్పుకొచ్చారు .
by Srinivas Vedulla | Apr 17, 2025 | జాతీయం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు దూరంగా భారత్- డైరెక్టర్ మరియా నీరా కీలక వ్యాఖ్యలు
“గుండె జబ్బులు, కేన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్‌లు (NCDs) రావడానికి వాయు కాలుష్యం ఒక కారణం. సెప్టెంబర్‌లో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై లోతుగా చర్చ జరుగుతుంది. వాయు కాలుష్యంపై మనం పోరాడుతున్నప్పుడు, NCDల ముప్పు కూడా తగ్గుతుంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు WHO మార్గదర్శకాల కంటే చాలా దారుణమైన గాలి నాణ్యతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాలు మరింత దారుణమైన స్థాయికి చేరుకున్నాయి” – – డబ్ల్యూహెచ్ఓ హెల్త్ వింగ్ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira)
భారత దేశంలో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన సాధారణ ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ వంట చేసుకోవడానికి కాలుష్య కారకాలైన కట్టెలు, పిడకలను ఉపయోగిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira), ఆందోళన వ్యక్తం చేసారు . భారత్‌లో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తక్షణ చర్యలు అవసరమని నీరా సూచించారు .
డాక్టర్ నీరా ఇటీవల పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . .. , గృహ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ఎల్పీజీ సబ్సిడీ వంటి పథకాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. “పథకాల నుంచి మంచి ఫలితాలను చూశాం. కానీ 41% భారతీయ గృహాలు ఇప్పటికీ బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది.” అని స్పష్టం చేసారు .
by Srinivas Vedulla | Apr 16, 2025 | సినిమా
2026 మార్చి 27 న పెద్ది విడుదల .. అంతవరకూ మెగా అభిమానులకు వెయిటింగే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సిని మాపై ఇండిస్ట్రిలో అమితాసక్తి నెలకొంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కి సూపర్-డూపర్ రెస్పాన్స్ వచ్చింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. పెద్దిలో అలనాటి అందాలతార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ‘పెద్ది’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం దర్శకుడు బుచ్చిబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ సూపర్ స్టార్ ఎవరనేది మరికొన్ని రోజులల్లో వెల్లడిచేయనున్నారు..
ఆ స్టార్ సూర్య అని ఇటీవల ప్రచారం సాగుతోంది. నిడివి తక్కువే అయినప్పటికీ పవర్ ఫుల్ రోల్. దీనికి సూర్య కూడా అంగీకరించినట్లు టాక్.
by Srinivas Vedulla | Apr 15, 2025 | జనరల్
ఏకకాలంలో 50వేల మందితో భోజనాలు- ఉజ్జయినిలోని నాగర్ భోజ్ భండారా వరల్డ్ రికార్డు- 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌తో నోరూరించే వంటకాలతో పసందైన విందు
వెయ్యి మందికి భోజనాలు పెట్టాలంటేనే పెద్ద హంగామా చేయాలి. పదిమంది ఆ పనిలో నాలుగైదు రోజులు బిజీగా ఉండాల్సిన పరిస్థితి . అలాంటిది ఏకంగా 50 వేల మందికి ఏకకాలంలో భోజనాలు పెట్టడమంటే మాటలా … అందుకే ఇది వరల్డ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది.
ఆంజనేయ స్వామి జయంతి సందర్బంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని.. అంబాపూర్‌లో ఈ ఘనత చోటుచేసుకుంది . ఆ ఊరిలో ఉన్న పురాతన ‘జై వీర హనుమాన్’ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక భోజన కార్యక్రమం (భండారా) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్తానం సంపాదించింది. ఈ కార్యక్రమానికి ‘నాగర్ భోజ్’ అని పేరు పెట్టారు . ఇందులో 50 వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయ ప్రసాదాన్ని తిన్నారు. వారంతా ఆలయ ప్రాంగణంలో బల్లలు, కుర్చీలపై కూర్చొని సాంప్రదాయ మాల్వా వంటకాలైన దాల్ బఫ్లా, లడ్డూ, కడీలను భుజించారు. భక్తులకు 600 మంది వాలంటీర్లు , కార్మికులు ఆహారాన్ని వడ్డించారు.
ఆహార పదార్దాల తయారీ కోసం 45 క్వింటాళ్ల బాఫ్లా గోధుమ పిండి, 7 క్వింటాళ్ల కంది పప్పు, 5 క్వింటాళ్ల పెరుగు, 6 క్వింటాళ్ల రవ్వ, 200 లీటర్ల పాలు, 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్‌ను వినియోగించారు.
— సామూహిక భోజన కార్యక్రమంలో వడ్డించిన వంటకాలను 70 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది.
-ఏకకాలంలో 50వేల మందితో జరిగిన ఈ విందు కార్యక్రమాన్ని దిల్లీకి చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్ విభాగం చేర్చింది. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్, న్యాయ నిర్ణేత వేదాంత్ జోషి ప్రదానం చేశారు.