చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ఈ నెల 17న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సభా ప్రాంగణం వద్ద భూమిపూజ చేశారు. అంతకుముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. వివిధ కమిటీలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు.
లక్షలాదిగా తరలిరానున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీడీపీ సూచించింది. బీజేపీ, జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో లక్షలాదిమందితో విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ సభకు హాజరవుతుండడంతో లోకేశ్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.