సభ్యత్వ నమోదులో టీడీపీ రికార్డ్..

సభ్యత్వ నమోదులో టీడీపీ నయా రికార్డ్ సాధించిందని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సభ్యత్వాల సంఖ్య 73 లక్షలకు చేరిందని తెలిపారు. టాప్ -5 లో నెల్లూరు, రాజంపేట, పాలకొల్లు, మంగళగిరి, కుప్పం ఉన్నాయన్న ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలను అభినందించారు. కొత్త సభ్యత్వాలతో పాటు యువత, మహిళల సభ్యత్వాలు నమోదు అయ్యాయని చంద్రబాబు తెలిపారు. క్యాడర్ సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు … Read more

Anitha: జగన్ వల్లే గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది: హోం మంత్రి అనిత

మాజీ సీఎం జగన్ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే గంజాయి, డ్రగ్సు సమస్య అధికమైందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని, అందువల్లే దుండగులు రెచ్చిపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని … Read more

Ram Gopal Varma: హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ వినతి

‘వ్యూహం’ సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ల వ్యంగ ఫొటోలను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానపై టీడీపీకి చెందిన మండల స్థాయి నేత కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం జరగాల్సిన పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం ఇవ్వాలని … Read more

Tirumala visit – YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు – నా మతం మానవత్వం.. వెళ్ళి డిక్లరేషన్ లో రాసుకోండి : ప్రెస్ మీట్ లో జగన్

తాడేపల్లి:  తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateswara Swamy) దర్శనం రద్దు చేసుకున్న ఏపీ మాజీ సీయం జగన్ (AP Ex CM YS Jagan), అనంతరం మీడియాతో (Media) మాట్లాడారు. తిరుమల పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలను జగన్‌ వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తుంది, దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోనే ఎక్కడా జరిగి ఉండవు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయ … Read more