Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home అభిప్రాయం

‘ఫీల్ గుడ్’ నుంచి టీడీపీ బయటపడాలి

క్షేత్రస్థాయి నుంచీ కేడర్ ని పటిష్ఠపరచడం, జగన్ చేష్టల వల్ల రాష్ట్రానికి జరుగుతున్న తీవ్ర నష్టాన్ని పేదవర్గాల సైతం అవగాహన కలిగించ గలగాలి..

V Srinivas by V Srinivas
April 2, 2023
in అభిప్రాయం
‘ఫీల్ గుడ్’ నుంచి టీడీపీ బయటపడాలి

” బ్రహ్మాండ0గా ఉంది.. ఈ సారి ఖచ్చితంగా గెలుపు మనదే..” ఇదీ కింద నుంచి పైదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్న భావన. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్వాంసకర పాలనే మనల్ని గెలిపిస్తుందని పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరిలో నాటుకుపోయింది. కొంతవరకు కరెక్టే. ఇటీవల 4 ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో జగన్ అప్రమత్తమయ్యారు. తన ఎన్నికల వ్యూహాలకు మరింత పదును పెట్టె పనిలో ఉన్నారు. ఆర్ధికంగా జగన్ పార్టీని టీడీపీ ఎదుర్కొనే స్థితిలో లేదు. ఫండింగ్ చెప్పుకోదగ్గ రీతిలో వస్తుందని కూడా నమ్మకంలేదు. తెలుగుదేశానికి విరాళాలు ఇస్తే.. స్థానికంగా జగన్ నుంచి.. పై నుంచి మోదీ పార్టీ నుంచీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం ముఖ్య0గా పారిశ్రామిక, వ్యాపార వర్గాలలో బలంగా ఉంది.

మద్యం కూడా కీలకమే.. ఏ ఎన్నికలలోనైనా మాస్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలంటే లిక్కర్ పంచాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రభుత్వం చేతిలో ఉంది.  ఎన్నికలలో మద్యం… పంచడానికి టీడీపీ ముందుకు వస్తే.. ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీ మాత్రం ముందుగానే మద్యం రెడీ చేసుకోవడానికి ప్రణాళికలు పెట్టుకున్నట్లు చెపుతున్నారు.

హింస ప్రేరేపిస్తే ఓటింగ్ తగ్గుతుంది.. వచ్చే ఎన్నికల్లో హింస చెలరేగే ప్రమాదం కూడా అధికంగానే ఉంది. దీన్ని ప్రతిపక్ష టీడీపీ ఎలా ఎదుర్కోవాలో స్పష్టమైన యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి. పోలింగ్ మొదటి ఒకటి, రెండు గంటలకే రాయలసీమలోనో, పల్నాడులోనో గలాటా జరిగి.. అది మీడియాలో ఫోకస్ అయితే.. రాష్ట్రంలో కోస్తా, ఉత్తరాంధ్రలలో పోలింగ్ శాతం తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. మహిళలు, 65, 70 ఏళ్ల వృద్ధులను పోలింగ్ ఫస్ట్ హవర్ లో తీసుకురాగలిగే వ్యవస్థను టీడీపీ ఏర్పాటు చేసుకోగలగాలి.

విద్వాంసాన్ని వివరించాలి.. వైసీపీ అరాచక పాలన, రాష్టాన్ని ఆర్ధికంగా దెబ్బతీస్తున్న వైనాన్ని ఎక్కడికక్కడ అవగాహన కలిగించేలా కేడర్ ని సమాయత్తం చేయాలి. ‘చంద్రబాబు వస్తే సాఫ్ట్ వేర్ వస్తుంది.. మీ పిల్లల భవిష్యత్తు బాగుటుంది..’ 5 వెలిచ్చే   వాలంటీర్ల ఉద్యోగాలు కాదు.. లక్షల జీతాలు వచ్చే బెటర్ జాబ్స్ వస్తాయ్.. అని పేద వర్గాలకు సైతం అర్ధమయ్యే రీతిలో చెప్పగలగాలి.

బలమైన కేడర్ ఏదీ?  టీడీపీకి ముక్యంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో స్ట్రాంగ్ కేడర్ లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కళా వెంకటరావు.. తదితర సీనియర్ల నియోజక వర్గాలలో సెకండ్ కేడర్ అత్యంత బలహీనంగా ఉండటం టీడీపీకి అతి పెద్ద మైనస్. కొంతమంది కీలక నేతలు మైనింగ్, గ్రావెల్ వంటి వాటిల్లో అధికార వైసీపీ నేతలతో లాలూచి అవ్వడం .. అవే అక్రమాలపై కింది స్థాయిలో టీడీపీ కేడర్ ఫైట్ చేయడం.. పరస్పర విరుద్దంగా ఉండటం కూడా పార్టీ కేడర్ కకావికలం అవ్వడానికి కారణమవుతున్నాయి. పెద్దాపురం సమీపంలో రామేశం మెట్ట అక్రమ గ్రావెల్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి వాటిని టీడీపీ అధినాయకత్వం పట్టించుకోవడంలేదని పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.

జగన్ వ్యతిరేకతపైనే ఆధారపడితే... టీడీపీ నేతలు అత్యధికంగా జగన్ పై రాష్ట్రంలో ఉన్న తీవ్ర వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుందన్న భ్రమల్లో తేలుతున్నారు. ఇప్పటికే మాస్ లో జగన్ కే బలం ఉందన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు పెడచెవిన పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కేడర్ కి ఉత్సాహమే. కానీ అది మితిమీరిన ఆత్మవిశ్వాసానికి బాటలు వేస్తోంది.

ఇప్పటికీ తుని లాంటి తప్పులెన్నో.. తుని అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె , ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్ భార్య శ్రీమతి దివ్య ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటి వరకు ఇంచార్ట్ గా ఉన్న యనమల కృష్ణుడుని తప్పించి.. దివ్యకు పదవి కట్టబెట్టారు. ఆమెకు తుని నియోజకవర్గంతో సంబంధం ఏంటి? ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. యనమల రామకృష్ణుడు ముందు నుంచీ  కార్యకర్తలతో గ్యాప్ మెయింటేన్ చేసే మనిషి. కార్యకర్త కష్టాన్ని ఏ నాడూ పట్టించుకోని యనమల  ఇప్పటికిప్పుడు కలుపుకు వెళ్ళడానికి యత్నిస్తే కేడర్ యాక్షేప్ట్ చేస్తారా?   చంద్రబాబు ఆబ్లిగేషన్ తో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు అనేకం ఉన్నాయ్.. అంటూ ఆ పార్టీ సీనియర్లే వాపోతున్నారు. . తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిన సమయంలో మరిన్ని తప్పులు చేయడం పార్టీకి తీవ్ర నష్టమే. కృష్ణుడిని తప్పించాల్సి వస్తే.. లోకల్గా అందుబాటులో ఉండే మరొక బలమైన నాయకుడికి ఎంపిక చేసుకోవాలే కానీ.. బెంగుళూరు నుంచి తీసుకువస్తే.. పార్టీ కేడర్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు? అనేది గమనించుకోలేకపోవడం అధినేత తప్పిదం. పార్టీ వేవ్ ఉందని యనమల తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు. కుమార్తె  గెలుపు కోసం యనమల తునిలో ఉంది .. అధికార వైసీపీతో  హోరాహోరీగా పోరాడతారా? తుని రావడానికే ఇష్టపడని యనమలకు పార్టీ కేడర్ అండగా ఉంటుందని భావిస్తే అది టీడీపీ పెద్దల మూర్ఖత్వం అవుతుంది.

ఇలాంటి తప్పిదాలు అనేకం ఇంకా కొనసాగుతుంటే.. జగన్ పై ఎంత వ్యతిరేఖత ఉంటె మాత్రం గెలుపు ఈజీ అనుకుంటూ.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లో విహరిస్తుంటే వాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలని కోరుకోవడం తప్ప ఎవరేమి చేయగలరు?

Tags: Feel Good
ShareSendShareTweet
Previous Post

ఈ ఫ్లాట్‌.. రూ.369 కోట్లట …

Next Post

పొత్తుల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయా..?

Related Posts

దేవుడున్నాడు.. బాబాయ్ హత్య.. జగన్ ఏమి చెపుతారు?
అభిప్రాయం

దేవుడున్నాడు..<> బాబాయ్ హత్య.. జగన్ ఏమి చెపుతారు?

July 23, 2023
పవన్- వలంటీర్లు
అభిప్రాయం

పవన్- వలంటీర్లు

July 16, 2023
ఏపీలో బీజేపీ దోబూచులాట
అభిప్రాయం

ఏపీలో బీజేపీ దోబూచులాట

July 9, 2023
Next Post
పొత్తుల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయా..?

పొత్తుల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయా..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

No Content Available
Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • మరిన్ని
    • టూరిజం
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved