ఇప్పుడు ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంటికే రప్పించుకున్నాం. రాత్రి, పగలు, ఇక్కడ, అక్కడ అని లేకుండా ఆకలి అనిపిస్తే చాలు ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటున్నాం. కొన్ని నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. అలాంటి ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఓ ఆర్డర్ నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది.
ఒక వ్యక్తి జొమాటో యాప్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అంతే కాదు అతను ఓ వింత అభ్యర్థన కూడా చేశాడు. ఆహారంతో పాటు బిల్లును పంపవద్దని, ఫుడ్ ప్యాకెట్ మీద కానీ.. మరెక్కడైనా ఆహారంలో చికెన్ ఉందని రాయవద్దని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్లింట్లో నాన్ వెజ్ ఫుడ్ కు అనుమతి లేదట. తనకు హ్యాపీగా నచ్చిన ఫుడ్ తినే అవకాశాన్ని కల్పించాలని..ఈ రెండు కోరికలను తీర్చమని జొమాటో సంస్థను కోరాడు. ఇంట్లో లేని స్వేచ్ఛ ఈ యాప్ లు కల్పిస్తున్నాయి కదా..