రాఖీ పండుగ దేశమంతా ఆనందోత్సాహాలతో సాగింది. ఈ పర్వ దినాన.. . కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆయన సోదరి ప్రియాంక గాంధీ.. తమ జీవితంలోని గత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాల్యం నుండి ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను జత చేసి.. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తన సోదరుడిని మెచ్చుకుంటూ గతంలో మాట్లాడిన ఓ వీడియోను ఈ సందర్భంగా ప్రియాంక షేర్ చేసుకున్నారు. అటు రాహుల్ సైతం.. అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంకతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తాను, ప్రియాంక కలిసి పెరిగామని, జీవితంలో కష్ట సుఖాలను చూశామని, ఒకరిలో ఒకరం ధైర్యాన్ని నింపుకున్నామని పేర్కొంటూ.. ఈ సోదరీసోదరుల మధ్య బంధం చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియలో పోస్టు చేశారు.