పరిపాలనలోనే కాదు.. వ్యక్తిగత విలువల్లోనూ తనదైన ముద్ర వేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జీవితం ఈ తరానికే కాదు.. ఏ తరానికైనా అధర్శమే..
సినీ పరిశ్రమలో బయోపిక్‌లకు చాలా క్రేజ్ ఉంది. మనకు తెలిసిన వ్యక్తుల జీవితాలలో.. మనకు తెలియని కథలు చూపించడం కోసం మేకర్స్ చాలా కష్టపడతారు. తెలిసిన వారి కథలు కావడంతో ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. ఇప్పటికీ ఎన్నో భాషల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తుల బయోపిక్స్ తెరకెక్కాయి. తాజాగా భారత్ మాజీ ప్రధానిపై తెరకెక్కుతున్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దివంగత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. దేశానికి చేసిన సేవలను మరవలేనివి. అందుకే ఆయన జీవితంపై ఓ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించింది బాలీవుడ్. ఇటీవల ఆ మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యి ఆకట్టుకుంటోంది. ఇప్పటికే వాజ్‌పేయి జీవితంపై ఓ పుస్తకం ఉంది. దాని ఆధారంగానే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.