శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ అంటే తెలియని వారులేరు. ఇప్పటికే జాన్వీకి చాలా ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. జూ.ఎన్టీఆర్ తో జాన్వీ నటించనుందా? అనే టాక్ సంచలనంగా మారింది. ఈ కాంబినేషన్ తో సినిమా కోసం ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్ తో సినిమాకి కొరటాల శివ రెడీ అవుతున్నారు. మరో రెండు నెలలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చెబుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాను కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో కొరటాల ఉన్నారని తెలుస్తోంది. తమ సినిమాతోనే ఆమె టాలీవుడ్ కి పరిచయం కావాలనే ఉద్దేశంతో ఆయన చాలా ట్రై చేస్తున్నారని అంటున్నారు. పెద్ద బ్యానర్ .. స్టార్ కాంబినేషన్లో కథ నచ్చితే జాన్వీ కపూర్ తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉందని ఆ మధ్య బోనీ కపూర్ చెప్పారు. దాంతో ఆమెను ఒప్పించడానికి కొరటాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జాన్వీ ఓకే అంటే ఈ ప్రాజెక్టుపై క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.