గుండెసమస్యలు, ఆస్తమాతో 42% మరణాలు
కొవిడ్‌తో 10 శాతం మంది మృత్యువాత
రిజిస్ట్రార్ జనరల్ తాజా నివేదికలో వెల్లడి
దేశంలో అత్యధిక శాతం మంది గుండె సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే మృత్యువాత పడుతున్నారు. 2020 సంవత్సరంలో 42 శాతం మంది ఈ మూడు సమస్యలతోనే చనిపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో 2020లో జరిగిన మరణాలపై రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఓ నివేదిక విడుదల చేశారు.
కొవిడ్ కారణంగా 1,60,618 మంది (మొత్తం మరణాల్లో 9 శాతం) మృతి చెందారని నివేదికలో పేర్కొన్నారు. 32.1 శాతం మంది గుండె సంబంధిత కారణాలతో చనిపోగా, శ్వాస సంబంధ సమస్యలతో 10 శాతం మరణాలు సంభవించాయి. రిజిస్ట్రార్చా జనరల్ తాజా నివేదికలో వెల్లడయ్యాయి. ఇటీవల చిన్న వయస్సు వారికీ గుండె జబ్బులు రావడానికి మారిన ఆహార అలవాట్లు, కనీస వ్యాయామం లేకపోవడం, వాయు కాలుష్యం వంటివీ కారణాలుగా చెప్పవచ్చు.