నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా ‘బింబిసార’ .. అంచనాలకు తగినట్టుగానే అతడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలికాలంలో మరే చిత్రానికి సాధ్యం కానివిధంగా కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బయ్యర్లను లాభాల్లోకి తీసుకొచ్చి పరిశ్రమ వర్గాల్లో కొత్త జోష్ నింపింది. చాలా ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు భారీ లాభాలు చవిచూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కాగా ఈ మూవీ టీం చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్‌కు మరింత ఊపునిస్తూ సోమవారం సాయంత్రం బ్లాస్టింగ్ రేంజ్ లో సాగె ర్యాప్ సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది. బింబిసారుడి పాత్రను గురించి వివరిస్తూ ట్రెండీ స్టైల్ లో సాగిపోయే ఈ గీతాన్ని లిప్సిక, ఆదిత్య అయ్యంగార్, పృథ్వి చంద్ర అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ ర్యాప్ సాంగ్ యూ ట్యూబ్‌లో అందరినీ అలరిస్తూ ట్రెండింగ్‌లో ఉంది. అంచనాలకు మించిన ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం లాంగ్‌రన్‌లో ఏమేరకు వసూళ్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.