రష్యా బలగాలుఉక్రెయిన్ పై బాంబుల మోత కురిపిస్తున్న వేళ ఆమె గుండె నిబ్బరంతో (ఉక్రెయిన్లి) వివ్లో ప్రత్యక్షమయ్యారు. ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ (Angelina Jolie) యుద్ధభూమి ఉక్రెయిన్‌లో పర్యటించారు. క్రమాటోర్క్స్ రైల్వేస్టేషన్‌పై రష్యా బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఆ దాడిలో గాయపడిన చిన్నారులను ఏజెంలీనా జోలి పరామర్శించారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న వాలంటీర్లతో మాట్లాడారు. అనంతరం ఆమె ఓ కేఫ్‌లోకి వెళ్లడంతో అక్కడున్నవారిని ఆశ్చపరిచారు. ఐక్యరాజ్యసమితి మానవతావాదిగా ఉన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో గత రెండు నెలల్లో 12 లక్షల 70 వేల మంది ఉక్రెనియన్లు తమ ఇళ్లకు దూరమయ్యారని జోలీకి స్థానికి అధికారులు తెలిపారు. వారంతా ఏమైపోయారో తెలియదని చెప్పడంతో జోలీ విషాద వదనంతో ఉండిపోయారు.