నాజర్.. ‘బాహుబలి’లో బిజ్జల దేవగా ఆయన అద్భుత నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. ‘బాహుబలిలో నాజర్ నటనే నాకు అత్యంత బాగా నచ్చింది..’అని రాజమౌళి కూడా అంగీకరించారు. అంతలా చెరగని ముద్ర వేశారు.సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటు దక్షిణాది-అటు ఉత్తరాదిలోనూ హీరో, విలన్, కమెడియన్, సపోర్టింగ్ క్యారెక్టర్‌గా.. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆయన గురించి ఓ వార్త ఫిల్మ్సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటూ అంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఆయన గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొన్నారని, అప్పుడు వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారట. దీంతో అప్పటినుంచి కుటుంబసభ్యులు సినిమాలకు దూరంగా ఉండి ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఒప్పుకున్న చిత్రాలను త్వరగా పూర్తి చేసి పర్మినెంట్‌గా ఇంటికే పరిమితమవ్వాలని సిద్ధమవుతున్నారని తెలిసింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే చిత్రపరిశ్రమ ఆయన సేవలను కోల్పయినట్లేనని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నాజర్ ఆరోగ్య త్వరగా బాగు అవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రిటైర్మెంట్ విషయంపై క్లారిటీ రావాలంటే ఆయన స్పందించే వరకు వేచి ఉండాల్సిందే.
1985లో ‘కల్యాణ అగితీగల్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు నాజర్. ఆ తర్వాత ‘నాయకన్’ సినిమా వచ్చేవరకూ నాజర్ కెరీర్ నత్త నడక సాగింది. అనంతరం వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేకుండా పోయింది. ‘రోజా’, ‘తేవర్ మగన్’, ‘బొంబాయి’, ‘కురుతి పునల్’…లాంటి సినిమాల్లో మంచి పాత్రలు దక్కడానికి కారణమైనది. మొత్తంగా కెరీర్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు.
నాజర్ 1995లో దర్శకుడిగా అభిరుచి చాటుకున్నాడు. మన తరం మరిచిపోతున్న జానపద సంస్కృతి, కళారూపాల నేపథ్యంలో ‘అవతారం’ చిత్రానికి దర్శకత్వం నిర్వహించారు. చిన్నతనంలో అతడు స్వయంగా వీక్షించిన జానపద కళారూపాలనే ఇతివృత్తంగా మలచి ఈ సినిమాని రూపొందించారు. ఈ చిత్రంలో విలక్షణ నటి రేవతి నాజర్‌కి జతగా నటించి మెప్పించారూ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడమే కాకుండా… విమర్శకుల ఆదరణని అందుకుంది. ఆ తరువాత నాజర్ 1997లో ‘దేవతార్’ అనే సినిమాని రూపొందించారు. అనంతరం ‘మాయన్’, ‘పాప్ కార్న్’, ‘సన్ సన్ తాతా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.