నందమూరి బాలకృష్ణ 108వ సినిమా ఇప్పటికే ఖరారైంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం గురించి తాజాగా తొలి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఓ స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ ఈ మూవీ నిర్మించనుంది. బాలయ్యను ఇప్పటి దాకా వచ్చిన సినిమాలకు భిన్నంగా చూపించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. వీడియో ఇంట్రో బీజేఎం అదిరిపోయింది. తమన్ స్వరాలు సమకూర్చనున్నారు. కాగా, బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారట. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించనున్నట్లు సమాచారం. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఈ నెలాఖరులోగా సోనాక్షి తో అగ్రిమెంట్ అవుతుందని భోగట్టా.