కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’ (NTR 30). అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే స్టార్ట్షు కానుంది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని నందమూరి అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ 2023 ఫిబ్రవరిలో షురూ కానుంది. అదేవిధంగా 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా NTR 30 రాబోతుండగా.. ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ పనిచేస్తుండటం విశేషం.యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొరటాల-తారక్ కాంబోలో వస్తున్న రెండోది. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ .