అమెరికా మరోసారి రష్యాను ఆరోపించింది. అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందని రచ్చచేసింది. అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందంటూ కొందరు చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా మాత్రం అమెరికా ఆరోపణలను కొట్టిపడేసింది. యుక్రెయిన్‌కు అదనపు యుద్ధ సాయం అందించేందుకు అమెరికా చట్టసభల్లో బిల్లును పాస్ చేయించుకునేందుకు ఈ ట్రిక్కులు ప్లే చేస్తోందని మండిపడింది.
ఉక్రెయిన్‌కు ఆయుధాలు సమకూర్చేందుకు మరో 60 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించే బిల్లును అమెరికా చట్టసభల్లో పాస్ చేయించుకునేందుకు బైడెన్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే, బైడెన్ ప్రయత్నాలను ప్రతిపక్ష రిపబ్లికన్లు అడ్డుకుంటన్నారు.