చాలా మందికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. భోజనం చివర్లో పెరుగు పడకపోతే ఏదో వెలితిగా ఫీలవుతారు. మీరు కూడా ఆ కోవలోకి చెందితే ఆరోగ్యం మీచేతిలో ఉన్నట్టే. మధ్యాహ్నం టైమ్లో కొంచెం హెవీగానే తింటుంటాం. కూరలు ఎక్కువగా తినడంతో కడుపు బరువుగా ఉంటుంది. అలాంటప్పుడు పెరుగు తీసుకుంటే అందులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకి హెల్ప్ అవుతాయి.
అంతే కాదు పెరుగు వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుంది. దీంతో బరువు, ఊబకాయం కూడా తగ్గే అవకాశం ఉంది. పెరుగులోని ప్రత్యేక గుణాలు సూక్ష్మక్రిముల నుంచి మనల్ని కాపాడే ఇమ్యూనిటీని పెంచుతాయి.