తమిళ స్టార్ విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటరవుతున్న విషయం తెలిసిందే.. ‘తమిళగ వెట్రి కజగం’ అనే పార్టీ పేరును కూడా ప్రకటించారు. అయితే హీరో విశాల్ కూడా పార్టీ పెడుతున్నట్టు ప్రచారం సాగింది. దానికి ఆయన స్పందించారు. అలాంటిదేమీ లేదని కొట్టి పడేశారు.
ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రజల్లో ఒకరిగా తన గళం వినిపిస్తానని ప్రకటించారు. తనపై అభిమానం చూపుతున్న ప్రజలకు ఎన్నటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. తన తల్లి పేరుతో దేవి చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరుతో పేద పిల్లల విద్యాభ్యాసం కోసం సాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు.