మనిషన్నాకా ఎవరు హ్యాపీగా ఉండాలనుకోరు.? దీని కోసం చుట్టూ ఉన్న వాతావరనమ్, కుటుంబ పరిస్థితులు, సామాజిక స్థితి గతులు.. ఇలా చాలానే కారణాలు ఉంటాయి. అయితే వీటితో పాటు మనం తినే ఆహారంలోని ఆనందాన్ని కలిగించే లక్షణాలు ఉన్నాయంటే నమ్మగలరా….
మానసిక స్థితి హార్మోన్ల ఉత్పత్తిపై ఆధారపడుతుంది. మనల్ని సంతోషంగా ఉండటంలో నాలుగు హార్మోన్లు హెల్ప్ చేస్తాయట. సెరోటోనిన్, ఎండార్ఫిన్, డోపామైన్, అక్షిటోసిన్ హ్యాపీగా ఉంచేందుకు సహకరించే హార్మోన్లు.
- సాల్మన్.. ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ లలో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్ఫల్మేషియన్ ను తగ్గించి, మనలో సంతోషాన్ని పెంచుతాయి.
- ఆకుకూరలు.. బచ్చలి కూర, కాలే, మెంతి, పుదీనా వంటి ఆకుకూరల్లో మేగ్నేషియం, ఎక్కువ ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. రోజంతా ఉల్లాసంగా ఉంచడంలో ఇది సహకరిస్తుంది.
- విత్తనాలలో పోషకాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి నానబెట్టుకుని తినడం ద్వారా ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. జీడిపప్పు, బాధమ్మ్, గుమ్మడి గింజలు, పుచ్చపప్పు వంటివి 6-8 గంటలు నానబెట్టి తినాలి.
- అరటి ,జామ, మామిడి, బొప్పాయిలలో విటమిన్ బి-6 ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి సహకరిస్తుంది.
- నీళ్లు తగినంత తాగకపోతే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. అందుకే 60 కిలోల బరువుండే సాధారణ మనుషులు 2 లీటర్ల వరకు నీటిని నిత్యం తాగాలి.
- టమాట, బ్రకోలి లో సెరోటోనిన్ ని ఉత్పత్తి చేసే కొన్ని రసాయనాలు ఉండటం వల్ల ఇది కూడా ఉపయోగపడుతుంది.