దేశీయ మహిళ కుబేరుల జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా తొలిస్థానంలో నిలిచారు. 2021 సంవత్సరానికిగాను కొటక్ మహీంద్రా బ్యాంక్-హురున్ సంయుక్తంగా విడుదల చేసిన జాబితాలో ఆమె సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో దేశీయ మహిళ సంపన్నవర్గాల జాబితాలో వరుసగా రెండోసారి తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో ఫల్గునీ నాయర్ దక్కించుకున్నారు. బ్యాంకింగ్ పెట్టుబడిదారుగా తన కేరియర్ను ప్రారంభించి ఫల్గునీ నాయర్..బ్యూటీ సంస్థ నైకాను ఏర్పాటు చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడంతో ఆమె సంపద రాకెట్ వేగంతో దూసుకుపోయింది. గతేడాదికిగాను రూ.57,520 కోట్ల నికర సంపదతో ఆమె ద్వితీయ స్థానం దక్కించుకున్నారు.
59 ఏళ్ల వయసులో., 59 ఏండ్ల వయస్సు కలిగిన నాయర్..గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆమె సంపద 963 శాతం ఎగబాకింది. (ఆమె 35ఏళ్ల యువతిల కనిపిస్తారు ) బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా సంపద మాత్రం 21 శాతం తగ్గినప్పటికీ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. రూ.29,030 కోట్ల నికర విలువ కలిగివున్నారు. భారత్లో పుట్టి లేదా ఇక్కడ పెరిగిన 100 మంది మహిళా సంపన్న వర్గాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ వందమంది మహిళల నికర సంపద 53 శాతం ఎగబాకి రూ.4.16 లక్షల కోట్లకు చేరుకున్నది. 2020లో ఇది రూ.2.72 లక్షల కోట్లుగా ఉన్నది. దేశ జీడీపీలో వీరి సంపద 2 శాతంగా ఉన్నది. రూ.300 కోట్లకు పైగా సంపద ఉన్నవారితో ఈ జాబితాను రూపొందించింది.