దేశీయ పబ్లిక్ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్ బి ఐ ఖాతాదారుల కోసం వాట్సప్ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
రిజిస్ట్రేషన్ ఇలా:
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి బ్యాంక్ ఖాతా నంబరును ఎంటర్ చేసి 7208933148 నంబరుకు మెసేజ్ చేయాలి.
సేవల కోసం:
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సేవలు పొందేందుకు రిజిస్టర్డ్ వాట్సాప్ నంబర్ నుంచి 9022690226 నంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలి. వెంటనే ‘మీకు వాట్సాప్ సేవలకు స్వాగతం’ అన్న సందేశం వస్తుంది.
సేవలు ఇవీ:
1. బ్యాలెన్స్ ఎంక్వైరీ
2. మినీ స్టేట్మెంట్
3. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు రద్దు
ఈ మూడు ఆప్షన్లలో మీకు కావాల్సినదాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు మినీ స్టేట్మెంట్ కావాలంటే 2 టైప్ చేస్తే సరిపోతుంది.
క్రెడిట్ కార్డు వినియోగదారులకు కూడా వాట్సాప్ సేవలను ఎస్బీఐ అందిస్తున్నది. ఈ సేవల ద్వారా రివార్డు పాయింట్లు, చెల్లించాల్సిన మొత్తం వంటి సేవలు పొందవచ్చు. వాట్సాప్ సేవల రిజిస్ట్రేషన్‌కు OPTIN అని 9004022022కు మెసేజ్ చేయాలి. లేదా 80809450 40 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చు. ఈ విధంగా సేవలు పొందవచ్చు.