ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం… జీతం రూ.2 లక్షలు అని చెప్పాడు. మంచి ఉద్యోగం.. మంచి జీతం.. ఇంకేముంది చాలా మంది నమ్మారు. పెళ్లి చేసుకున్న తర్వాత అందినకాడికి అంతా దండుకోవడం, గట్టిగా నిలదీస్తే పరారవడం.. ఇది అతడి స్టైల్. ఈ స్టైల్ లో ఇప్పటికి 13 మంది అమ్మాయిలను మోసం చేశాడు. అతడి పేరు అడపా శివశంకర్ బాబు. ‘ఆ బాబును హైదరాబాదు గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. శివశంకర్ బాబుపై హైదరాబాదు, సంగారెడ్డి, గుంటూరు జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. అమెరికాలో ఉన్న ఓ యువతిని కూడా ఇలాగే మోసం చేశాడు. బాగా డబ్బున్నవారికి గాలం వేసి ఎంజాయ్ చేసేవాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఒకే కాలనీలో మూడు వీధుల్లో ముగ్గురితో కాపురం చేయడం. (శివశంకర్) బాబుది.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి. ఇంజినీరింగ్ చదివాడు.. విలాసాల కోసం మోసాల బాటపట్టాడు.