by Srinivas Vedulla | Apr 25, 2025 | ఆంధ్రప్రదేశ్
అరెస్టులతో తెలుగు తమ్ముళ్లను సంతృప్తి పరచవచ్చని లోకేష్ భావిస్తున్నారా ?
వైసీపీ హయాంలో భారీ దోపిడీ, అరాచకాలకు పాల్పడిన వారి అరెస్టులకు ముహూర్తం పెట్టారా ?
అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడి , అక్రమాలకు ఒడిగట్టిన బడాబాబులపై చర్యలు జాప్యం కావడంతో ఇన్నాళ్లు టీడీపీ, జనసేన కేడర్ లో అసంతృప్తి చెలరేగింది. అడపా , దడపా చిన్న చిన్న అరెస్టులు చేసి తూతుమంత్రంగా చేతులు దులుపుకుంటున్నారన్న అక్కసుతో ఉన్న కేడర్ … వారం రోజులుగా జరుగుతున్న అరెస్టులతో సంతృప్తి చెందుతుందా? అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్న సోషల్ మీడియా సైన్యం ఆక్రోశం ఈ అరెస్టులతో కాస్త చల్లారుతుందా >
వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కొంత మందికి కంటిమీద కునుకు కరువైంది . అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోంది . జగన్ అండ్ కో అండ చూసుకుని చెలరేగిపోయిన అరాచకవాదులు , అక్రమార్కులకు సెగ పుడుతోంది .
వరుసగా అరెస్టులు -చర్యలు
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అక్రమాలు , అరాచకాలు రాజ్యమేలాయి . పలు అధరాలు దొరికినా మొదట్లో కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణితో వ్యవహరించారు . ఈ మెతక వైఖరితో ప్రధానంగా టీడీపీ కేడర్ , సొంత పార్టీకి వాలంటీర్ గా పనిచేస్తున్న సోషల్ మీడియా ఏకంగా చంద్రబాబుపైనే తిరుగుబాటు ప్రకటించింది . దీంతో గత్యంతరం లేక అరాచకుల అరెస్టులు మొదలుపెట్టారన్న ప్రచారం సాగుతోంది .
ఐదు సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ వ్యతిరేక, నేరస్తుల పాలనపై వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తమను చిత్ర హింసలు పెట్టిన వారి సంగతి తేల్చాలని కూటమి పార్టీలు టీడీపీ , జనసేన కేడర్ తో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే ప్రభుత్వం ఓ ప్రణాళికతో ఉందని స్పష్టమయింది. మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీనాధ్ అరెస్టు దగ్గర నుంచి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ పై చార్జెస్ వరకూ అన్నీ ప్రణాళికాబద్దంగా, క్రమబద్ధంగా.. చట్టబద్దంగా జరిగిపోతున్నాయి. కింగ్ పిన్ ను పూర్తి స్థాయిలో బుక్ చేసే వరకూ ఇవి సాగిపోతాయి.
పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో టెన్షన్: జగన్ సీఎంగా ఉన్నపుడు ఇంటెలెన్గ్స్ డీజీ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయులు అరెస్టుతో వైసీపీ అరాచకవాదులతోపాటు , అప్పట్లో ఆ ఆపార్టీకి తొత్తులుగా వ్యవహరించి , అక్రమాలలో భాగస్వాములైన ఉన్నతాధికారుల వెన్నులో వణుకుపుడుతోంది .
ముంబై నటి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి , వేధింపులకు గురిచేసి , చివరికి వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా ముంబై నుంచి చట్ట విరుధ్దగా తీసుకువచ్చి నిర్బంధించిన కేసులో ఆంజనేయులు అరెస్ట్ కావడం గమనార్హం . ఈ కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ , కాంతి రానా టాటా లు అరెస్ట్ కాకుండా తాత్కాలికంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు .
- మద్యం కుంభకోణం కేసులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి , , అలియాస్ రాజ్ కసిరెడ్డి ని సిఐడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు . విచారణల్లో ఇప్పటికే అతను కీలక విషయాలు వెల్లడించినట్లు చెపుతున్నారు . ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి , మిదున్ రెడ్డి , మాజీ సీఎం జగమ్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైసీపీ వర్గాలే బాహాటంగా వెల్లడిచేస్తున్నాయ్ .
పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ అరెస్టు
మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను దహనం చేసిన ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కానీ పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్టు చేశారు. ఇలా చేస్తారని ఏ మాత్రం ఊహించలేకపోయాడు మాధవరెడ్డి. ఈయన పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు. ఈ ఫైళ్ల కాల్చివేతలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వచ్చాయి . అయితే డైరెక్ట్ గా పెద్దిరెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడానికి బలమైన అధరాలు దొరకలేదు . అయితే మాధవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
- అరెస్ట్ చేసి జైలుకెస్తే , ,, కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది . బయటకు వచ్చి సదరు నేతలు , అధికారులే తొడకొట్టి కూటమి సర్కార్ నేతలతో ఆటలాడుకునే పరిస్థితి తలెత్తుతుంది . దీనిని దృష్టిలో పెట్టుకుని , చట్ట ప్రకారం బలమైన అధరాలు సేకరించిన తర్వాతే అరెస్టులు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు చెపుతున్నారు .
- మాజీ మంత్రి కొడాలి నాని , మాజీ ఎమ్మెల్యే, జగన్ ముఖ్య అనుచరుడు, బియ్యం స్మగింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , అటవీ భూములను నకిలీ రికార్డులతో కానేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . .. ఇలా పలువురు కీలక నేతల అరెస్టులపై టీడీపీ , జనసేన కేడర్ ఎదురు చూస్తోంది . నెమ్మదిగా వీరంతా కూడా జైలుకెళ్లి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయ్ .
by Srinivas Vedulla | Apr 24, 2025 | జాతీయం
”ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమయింది . .” అని ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు . పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి వేటాడి భారత్ హతమారుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు.కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.
by Srinivas Vedulla | Apr 24, 2025 | ఆంధ్రప్రదేశ్
మూడు వేదికలు – ఎనిమిది మార్గాలు.. 5 లక్షల మంది వస్తారని అంచనా
మే 2వ తేదీన ఖరారైన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది . మే 2వ తేదీన అమరావతికి వస్తున్నారు భారత్ ప్రధాని . రాజధాని అమరావతిలో 15 నిమిషాల పటు రోడ్డుషో, గంట పాటు సాగే ఈ పర్యటనకు అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.
మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకుని హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర 15 నిమిషాలపాటు రోడ్డు షోలో పాల్గొంటారు. 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సభ అనంతరం అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20కి గన్నవరం నుంచి దిల్లీకి వెళతారు.
లక్ష కోట్ల ప్రాజెక్టులకు మోడీ చేతుల మీదుగా . ..ప్రధాని సభకు చేరుకునేందుకు దాదాపు 8 మార్గాలను పరిశీలించి ఖరారు చేసారు . దాదాపు లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు పనులకు మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రాజధాని పనుల పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
పటిష్టమైన వేదికలు . . ప్రధాని సభ కోసం 3 వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూసమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.
జనం రాక కోసం . .రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ, అటు గుంటూరు, తెనాలి, నరసరావుపేట, సత్తెనపల్లి మీదుగా ప్రధాని సభకు చేరుకునేందుకు 8 మార్గాలను గుర్తించారు. మొత్తం 9 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి, రాజధానిలోని సీడ్‌యాక్సెస్ రోడ్డు, ఎన్10 రహదారుల మీదుగా వేదిక వద్దకు చేరుకుంటారు.
గుంటూరు, తెనాలి, మంగళగిరి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా వచ్చేవారు ఇ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. కాజా టోల్‌ప్లాజా సమీపంలోని మురుగన్ హోటల్ వద్ద ఎన్‌హెచ్-16 సర్వీసు రోడ్డులోంచి, ఎన్‌హెచ్ బైపాస్ జంక్షన్, నిడమర్రు, కురగల్లు మీదుగా ఎన్9 రహదారిలోకి ప్రవేశిస్తారు. గుంటూరు అమరావతి రోడ్డు, ఐఆర్‌ఆర్ జంక్షన్, గోరంట్ల, లామ్-తాడికొండ క్రాస్‌రోడ్లు, పెదపరిమి మీదుగా వచ్చేవారు ఇ6, ఎన్11, ఇ8, ఎన్10 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు. నరసరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, గుంటూరు, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, దొండపాడు మీదుగా వచ్చేవారు ఇ3, ఎన్11, ఇ8 రహదారుల ద్వారా వేదిక వద్దకు చేరతారు.
హైదరాబాద్, ఏలూరు, విజయవాడ నుంచి వచ్చేవారు జాతీయ రహదారి బైపాస్ బ్రిడ్జి మీదుగా రాజధానిలోకి ప్రవేశించి ఇ8, ఎన్8 రహదారుల ద్వారా వద్దకు చేరతారు. విజయవాడ నుంచి కనకదుర్గ వారధి, తాడేపల్లి మీదుగా వచ్చేవారు భారతమాత విగ్రహం, ఉండవల్లి సెంటర్, కృష్ణాయపాలెం మీదుగా ఈ8, ఎన్9 రహదారుల్లోకి ప్రవేశించి వేదిక వద్దకు చేరతారు. పోలీస్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు .
by Srinivas Vedulla | Apr 23, 2025 | ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల చరిత్రలో సరికొత్త రికార్డ్
పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 98 శాతం , 99 శాతం మార్కులు సాధిస్తేనే అత్యంత ఘనతగా చెప్పుకుంటాం . అలాంటిది 600 కి 600 మార్కులు సాధించి కాకినాడ విద్యార్థి అత్యంత అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది . నేహంజని అనే కాకినాడకు చెందిన స్టూడెంట్ కి ఈ ఘనత దక్కింది . ఈ బాలిక కాకినాడ భాష్యం స్కూల్ లో చదువుతోంది.
ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో ఎండ అనితకు 599 – ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్ పావని చంద్రికకు 598 మార్కులు
మరోవైపు ఎలమంచిలి చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది.
ఇంతటి ఘనత సాధించిన ఈ చిన్నారులను అభినందించాల్సిందే . అలా అని అందరి పిల్లలూ ఈ మాదిరిగా మార్కులు సాధించాలని ఒత్తిడి చేయడం మాత్రం సరికాదని పేరెంట్స్ గుర్తించుకోవాలి . మార్కులు అవసరమే కానీ , అవి ఒక్కటే కొలమానం కాదని మర్చిపోకూడదు .
by Srinivas Vedulla | Apr 21, 2025 | ఆంధ్రప్రదేశ్
విజయసాయి రెడ్డి బిజెపిలో చేరడానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట . ఇలాంటి నేతలను చేర్చుకుంటే వాళ్లపై ఉన్న అవినీతి , అరాచక మచ్చలు తమ పార్టీపై పడతాయన్న భావం కొందరు అసలైన బీజేపీ నేతలలో ఉంది . అయితే ఏపీలో మన పార్టీ ప్రభావం ఎంత ? దీనిగురించి ఎన్నికల నాటికీ జనం మర్చిపోతారులే . . అని వైసీపీకి మద్దతుగా నిలిచే ఒకరిద్దరు బీజేపీ నేతలే అధిష్టానానికి రికమండ్ చేస్తున్నారట .
ఆవిర్భావం నుంచీ సాయిరెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. YSRCP అధినేత జగన్ మోహన్ రెడ్డికి నమ్మకమైన సహాయకుడిగా ఇన్నాళ్లూ వ్యవహరించారు. 2019 లో అధికారంలో ఉన్నపుడు వైసీపీలో విజయసాయి నెంబర్-2 గా వెలుగోదరు. జగన్కి- అతనికి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ… ఈ సంవత్సరం జనవరిలో, విజయసాయి రెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి రాజకీయాల నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
కాకినాడ పోర్టు కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్కానర్ మరియు వైఎస్‌ఆర్‌సిపి పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో ఉన్న విజయసాయి రెడ్డి క్రియాశీల రాజకీయాలను విడిచిపెట్టి, జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్‌ఆర్‌సిపికి దూరమై, తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినా . .. విజయసాయి రెడ్డి మాటలను జనం నమ్మలేదు .
ఒకే చాయిస్: విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక చాయిస్ బీజేపీ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. అతనిపై ఈడీ , సీబీఐ కేసులు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. వాటి నుంచి రక్షణ కోసం తప్పనిసరిగా బీజేపీ యేతర పార్టీ గురించి ఊహించడానికే సాహసించలేని పరిస్థితి.
“ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాషాయ పార్టీ కూడా ఆయనను స్వాగతించడానికి చాలా ఆసక్తిగా ఉంది. కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. విజయసాయి రెడ్డి చేరిక టిడిపితో ఉన్న ముఖ్యమైన పొత్తులో చికాకు కలిగించకూడదని బిజెపి కోరుకుంటోంది” అని విజయసాయి రెడ్డికి సన్నిహితుడైన ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు.
“ఇక మిగిలి ఉన్నది నాయుడు నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసి) మాత్రమే.” అనేది సదరు నేత అభిప్రాయం .