మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎక్కువ ఫీజుకు యాజమాన్యం అమ్ముకుంటోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీలో 40 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లాభాపేక్ష కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేనేజ్ మెంట్ కోటా సీట్లను ఎంతకు అమ్ముకున్నారనే దానిపై ఐటీ అధికారులు ఆరాతీసి, రికార్డులను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటిని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాలేజీ మేనేజ్ మెంట్, సిబ్బందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు. బంధువుల పేర్లతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించినట్టు సమాచారం.