ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ల అధినేత ఎలాన్ మస్క్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అంగీకరించారు. కెటామైన్ను వాడుతున్నానని, టెస్లా కంపెనీ నిర్వహణలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడుతోందని వెల్లడించారు. ఇటీవల డాన్ లెమన్ అనే ప్రముఖ జర్నలిస్టుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మస్క్ ఒప్పుకున్నారు. డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోడానికి డ్రగ్స్ ను ఉపయోగిస్తున్నానని మస్క్ తెలిపారు.
ఒక వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకుంటానని మస్క్ వివరించారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఉందని, నసిక స్థితిపై ఎక్కువ సమయం ప్రభావం చూపే డ్రగ్స్ వాడకూడదని సూచించారు. అయితే మస్క్ ఆరోగ్యంపై, కంపెనీ పర్యవేక్షణపై దుష్ప్రభావం చూపవచ్చని కథనాలు పేర్కొన్న విషయం తెలిసిందే.