- హీరోయిన్ దిశ పటాని
- విలన్ గా బాబీ డియోల్
స్టార్ హీరో సూర్య అటు తమిళ్, ఇటు తెలుగు ప్రేక్షకులకు చాలా చేరువైన నటుడు. తన విభిన్న పాత్రలతో, విలక్షణ నటనతో మాస్ నుంచి క్లాస్ వరకు అందరినీ అలరించే స్టార్. సూర్య కెరియర్ లో ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పుడు కూడా సూర్య ఒక ప్రయోగాత్మక చిత్రానికి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. అదే ‘కంగువ’. ఈ సినిమాలో సూర్య ఒక యుద్ధ వీరుడిగా నటించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేవిధంగా ఉన్నాయి.
యూవీ క్రియేషన్స్ – స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిర్మాతలు చెపుతున్నారు. అందుకోసం అధిక బడ్జెట్ కేటాయించారని టాక్ నడుస్తోంది. విలక్షణమైన పాత్ర, విభిన్నమైన కథ కావడంతో సూర్య ఈ మూవీకి ఓకే చెప్పిన మాట వాస్తవమే. అందుకే అభిమానులంతా ఈ సినిమా ఆయన కెరియర్లో మరో ప్రత్యేక స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను అద్భతహా అనిపిస్తాయట. ఈ సినిమాకి మొసలితో సూర్య పోరాడే దృశ్యం హైలైట్ అని అంటున్నారు. దిశ పటాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించబోవడం మరో హైలైట్. 38 భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది.