పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు పవన్ ప్రకటించిన వెంటనే ఎక్స్ వేదికగా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘సడన్ డెసిషన్. హ్యాపీ టు ఇన్ఫామ్. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా’ అని ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ట్వీట్ ఏపీలో సంచలనం కలిగింది.
అయితే తాను పిఠాపురం నుంచి పోటీ చేయడం లేదని తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. పిఠాపురంలో తాను తీసిన షార్ట్ ఫిలిమ్ లో కంటెస్ట్ గురించే తాను చెప్పానని ఆర్జీవీ తెలిపారు. ఎలెక్షన్ అనే పదాన్నే తాను వాడలేదని… తన ట్వీట్ పై మీడియా ఊహాగానాలు చేసిందని.. ఈ మిస్ కమ్యూనికేషన్ కు తాను బాధ్యుడిని కాదు కాబట్టి… తాను సారీ చెప్పబోనని అన్నారు.