మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి అమెరికా వెళ్తున్నారు.ఫ్లైట్ లో వెళ్తున్న ఫొటోను షేర్ చేశారు. అంతే కాదు తన అభిమానులకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు.
తన భార్య సురేఖతో కలిసి ఆయన హాలిడే ట్రిప్ కు అమెరికాకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే ‘విశ్వంభర’ షూటింగ్ లో తిరిగి పాల్గొంటానని తెలిపారు.