కాలిఫోర్నియాకు చెందిన జెస్సికా అనే మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? ఆమె ఆరు నెలల్లోనే మరో బిడ్డకు జన్మనిచ్చింది. అంటే గర్భం దాల్చిన మూడు నెలలకు మరోసారి గర్భం దాల్చింది. ఒకే సమయంలో జెస్సికా కడుపులో వేర్వేరు వయసున్న పిండాలు ఎదిగాయి. వారాల వ్యవధిలో ఉన్న ఈ శిశువులు పూర్తిగా ఎదిగిన తర్వాత భూమ్మీదకు వచ్చాయి. అత్యంత అరుదైన ఈ పరిస్థితిని వైద్య చరిత్రలో ‘సూపర్ ఫిటేషన్’ అని వ్యవహరిస్తారని డాక్టర్లు వెల్లడించారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం పది మాత్రమే ఉన్నాయని, జెస్సికా కేసు పదకొండవదని చెప్పారు.
సూపర్ ఫిటేషన్..
మహిళ గర్భాశయం నుంచి విడుదలయ్యే అండం సంభోగం తర్వాత విడుదలయ్యే శుక్ర కణంతో కలిసి గర్భాశయంలో పిండంగా రూపుదిద్దుకుంటుంది. ఇలా గర్భందాల్చిన తర్వాత సాధారణంగా సంభోగంలో పాల్గొన్నపుడు మరోసారి అండం, శుక్ర కణాలు కలిసేందుకు వీలుండదు. కాని సూపర్ ఫిటేషన్ లో ఈ ప్రాసెస్ పునరావృతం అవుతుంది. ఓవైపు గర్భాశయంలో పిండం రూపుదిద్దుకుంటుండగా మరో అండం, శుక్ర కణంతో కలిసి గర్భాశయంలోనే సెపరేట్ గా పిండంగా ఏర్పడుతుంది. మొదటి పిండానికి వారాల తేడాతో రెండో పిండం కూడా ఎదుగుతుంది.