ఇండస్ట్రీ లో కొంతమంది హీరో హీరోయిన్లు పారితోషకం కాస్త ఎక్కువగా అఫర్ చేస్తే చాలు.. కథ ఎలా ఉన్నా పట్టించుకోరు. పెద్దగా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా వచ్చిన ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేస్తుంటారు. అయితే మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ మాత్రం ఇందుకు బిన్నం. . ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘రూ. 500 కోట్లు వసూలు చేసే బారి బడ్జెట్ సినిమా అయిన సరే, ఆమె పాత్ర కు ప్రాధాన్యత లేకపోతే ఆ సినిమా లో నటించను అని బల్లగుది మరి చెప్తుంది ‘ ఈ చిన్నది. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా లు హిట్ అయినప్పటికీ ఆమె పాత్ర బాలేన్నప్పుడు ఆమెకి గుర్తింపు రాదని మాళవిక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది . మోడల్ గా కేరిర్ ప్రారంభించిన మాళవిక 2013 లో ‘పట్టం బోలా ‘ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది.