‘ఏలియన్స్’ నిజాలను అమెరికా దాస్తోందా?.. సైంటిస్ట్‌లు అదే పనిలో ఉన్నారా? దీనిపై ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలతో పాటు , మేధావులలో సైతం ఆలోచన రేకెత్తిస్తోంది.
ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతుందా?.. ఇప్పటికే అమెరికా వద్ద గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఉందా? మానవేతర అవశేషాలపై యూఎస్ శాస్త్రవేత్తలు పరిశోధన కూడా చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు అమెరికాకు చెందిన మాజీ నిఘా అధికారి. అమెరికా పార్లమెంట్‌కు ఈయన ఇచ్చిన వాంగ్మూలం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
” గ్రహాంతర వాసుల గురించి అమెరికా వద్ద సమాధానం ఉందా? అన్న ప్రశ్నకు …ఔను.. ఉంది.. అన్న సమాధానంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యంనకు గురవుతున్నారు.