‘ఏకంగా ప్రధాన మంత్రినే ఆ కోర్ట్ సస్పెండ్ చేసిన ఘటన ఇది.. ఎక్కడ జరిగింది.. ఏమిటా కధ..’
థాయ్లాండ్ రాజ్యాంగ కోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి ప్రయూత్ చాన్-వో-చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ప్రయూత్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు పిటిషన్ను దాఖలు చేశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం.. వారి వాదనతో ఏకీభవించింది. కానీ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారా? లేదా అనే ఆంశంపై ఎలాంటి స్పష్టత వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రయూత్ను ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఆయన చేపడుతున్న రక్షణ శాఖను కొనసాగింపుపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తాత్కాలిక ప్రధాని ఎవరు అనేది నిర్ణయించలేదు. రాజ్యాంగం ప్రకారం ఉపప్రధానమంత్రి ప్రవిత్ వాంగ్సువన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.