‘దేశ భక్తి ఉండనివారెవరు? అయితే సొంత దేశంపై ఉండే భక్తిని ఎవరి శక్తి సామర్ధ్యాల మేరకు, ఎవరి మేధా శక్తి మేరకు దేశం కష్టాల్లో ఉన్నపుడు ఉపయోగపడాలి..’ 15 ఏళ్ల ఉక్రెయిన్ బాలుడు అదే చేసాడు.’
ఉక్రెయిన్లో రష్యా బలగాల చొరబాటును అడ్డుకునేందుకు సాధారణ పౌరులు సైతం ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఘటనలు ఉన్నాయి. యుద్ధ ట్యాంకులకు ఎదురుగా వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇదేవిధంగా కీవ్ శివారు ప్రాంతానికి చెందిన ఆండ్రీ పోక్రాసా అనే 15 ఏండ్ల బాలుడు దేశం కోసం హీరోయిజం ప్రదర్శించాడు. తండ్రి సాయంతో తన వద్ద ఉండే చిన్న బొమ్మ డ్రోన్ సాయంతో నగరం వైపు దూసుకొస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఫొటోలు, అవి ఉన్న లోకేషన్ల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అందించేవాడు. తామిచ్చిన సమాచారం 20 రష్యా ట్యాంకులను ధ్వంసం చేయడంలో ఉక్రెయిన్ సైన్యానికి సహకరించిందని ఆండ్రీ చెబుతున్నాడు.